66వ జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలు

65th national film awards, 66 National Film Awards, 66 National Film Awards- Full Winners, 66 National Film Awards- Full Winners List, 66th national film awards, mammootty, mammootty on national award, Mango News Telugu, national award, national awards, national film awards, national film awards 2018, national film awards 2019, peranbu movie

66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. జ్యూరీ సభ్యులు ముందుగా విజేతల జాబితాను కేంద్రం, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కు అందజేశారు. 2019 ఏప్రిల్ నెలలోనే ఈ అవార్డ్స్ ప్రకటించాల్సి ఉండగా, అప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల వలన వాయిదా వేశారు. 31 కేటగిరులకు సంబంధించిన అవార్డులను ఈ రోజు ప్రకటించారు. తెలుగు సినిమా పరిశ్రమ నుండి మహానటి, రంగస్థలం, చి.ల.సౌ, అ! చిత్రాలు సాంకేతిక విభాగాలలో అవార్డ్స్ దక్కించుకున్నాయి. నటి విజయశాంతి 1990 లో కర్తవ్యం చిత్రానికి గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది. మళ్ళీ 29 సంవత్సరాల తరువాత నటి కీర్తీ సురేష్ మహానటి అనే తెలుగు చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది.

అవార్డు విజేతల జాబితా:                                                                                                                                                                                                                                                                                                          ఉత్తమ్ చిత్రం: హెల్లారో (గుజరాతీ)
ఉత్తమ నటుడు: ఆయుష్మాన్‌ ఖురానా(అంధాధూన్), విక్కీ కౌశల్ (ఉరి)
ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌ (మహానటి)
ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్‌(ఉరి)
ఉత్తమ సహాయనటి: సురేఖ సిక్రీ(బదాయిహో)
ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్‌ కిర్‌కిరే (చంబక్‌)
ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్‌మాన్‌ (హిందీ)
జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్‌
ఉత్తమ వినోదాత్మక చిత్రం: బదాయిహో
ఉత్తమ పరిచయ దర్శకుడు: సుధాకర్ రెడ్డి యాకంటి (నాల్)
ఉత్తమ పర్యావరణ పరిరక్షణ నేపధ్య చిత్రం : పానీ(మరాఠీ)                                                                                                  జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి
ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ
ఉత్తమ యాక్షన్ చలన చిత్రం: కేజిఎఫ్-1
ఉత్తమ ఆడియోగ్రఫీ: రాజాకృష్ణన్(రంగస్థలం)
జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్
బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: మహానటి (తెలుగు)
బెస్ట్‌ మేకప్‌: అ!(తెలుగు)
ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: చి.ల.సౌ (తెలుగు)
ఉత్తమ సాహిత్యం: నాతిచరామి (కన్నడ)
ఉత్తమ స్పెషల్ఎఫెక్ట్‌ : అ!(తెలుగు)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్‌ : కమ్మరా సంభవం(మలయాళం)
బెస్ట్‌ ఎడిటింగ్‌: నాతిచరామి (కన్నడ)
ఉత్తమ సౌండ్ డిజైనింగ్: ఉరి
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: అంధాధూన్
బెస్ట్‌ డైలాగ్స్‌: తారీఖ్‌(బెంగాలీ)
ఉత్తమ గాయకుడు: అర్జిత్ సింగ్‌(పద్మావత్‌)
ఉత్తమ గాయని: బిందు మాలిని (నాతిచరామి)
నర్గీస్ దత్ అవార్డు: వండల్లా ఎరడల్లా (కన్నడ)
ఉత్తమ బాల నటులు: పీవీ రోహిత్‌ (కన్నడ), షాహబ్ సింగ్‌(పంజాబీ), తల్హా అర్షద్ (ఉర్దూ), శ్రీనివాస్‌ పొకాలే(మరాఠి)

 

[subscribe]
[youtube_video videoid=pccnd-Wjxkk]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 11 =