బీజేపీ ఎంపీలకు శిక్షణా కార్యక్రమం

amit shah, BJP MLA, BJP MP, BJP Organises Orientation, BJP Organises Orientation Programme, BJP Organises Orientation Programme For Party Members, BJP Organises Orientation Programme For Party MPs, BJP Orientation Programme For Party Members, BJP Working President, Defence Minister, Defence Minister Rajnath Singh, Home Minister, Home Minister Amit Shah, Narendra Modi, Orientation Programme For Party Members, Prime Minister, Prime Minister Narendra Modi, Rajnath Singh

భారతీయ జనతా పార్టీ వారి పార్లమెంటు సభ్యులుకు (ఎంపిలు) ‘ అభ్యాస్ వర్గ’ పేరుతో రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ లో కీలక అంశాలపై ఎలా స్పందించాలి, ప్రజలతో ఎలా మెలగాలి మరియు కార్యకర్తలతో ఎలా మమేకం అవ్వాలి అనే అంశాలపై పార్లమెంట్ లోని జిఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ఈ శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి.నడ్డా హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి మీడియాకి అనుమతి ఇవ్వలేదు.

ఈ శిక్షణా కార్యక్రమంలో మొదటగా జె.పి.నడ్డా మాట్లాడుతూ, పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా పార్లమెంట్ కు హాజరుకావాలని పిలుపునిచ్చారు. వివాదాస్పద అంశాలపై పార్టీ ఎంపీలు స్పందించాల్సిన పద్ధతి వివరించారు. పార్లమెంటరీ విధి విధానాలపై ఎంపీ భూపేంద్ర యాదవ్ శిక్షణ ఇవ్వనున్నారు మరియు ఎంపీ ఫండ్స్ ఖర్చుచేసే విధానంపై కొందరు కేంద్ర మంత్రులు మిగతా ఎంపీ లకు వివరించనున్నారు. ప్రభుత్వం మరియు పార్లమెంటులో ఎంపిలు పాత్ర , బీజేపీ విధానాలు, కార్యాచరణ గురించి హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడతారు. ఇకపై అవసరాన్ని బట్టి ఇటువంటి శిక్షణా తరగతులు తరుచుగా జరుగుతాయని బీజేపీ సీనియర్ ఎంపీలు పేర్కొన్నారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here