దేశానికి చారిత్రాత్మకమైన రోజు, చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం

Chandrayaan 2 Launch Updates Every Indian is immensely proud, Chandrayaan 2 Launch Updates Spacecraft Successfully Injected Into Earth Orbit, India Moon Mission Chandrayaan 2, India successfully launches Chandrayaan 2, Mango News, Nation applauds as ISRO bounces back with flying colours, PM Modi congratulates ISRO Chandrayaan 2

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) సరికొత్త చరిత్ర సృష్టించింది, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించిన చంద్రయాన్-2, రాకెట్ నుండి విడిపోయి భూకక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది. ప్రయోగం విజయవంతం అవ్వడంతో ఇస్రో లో శాస్త్రవేత్తలు పరస్పరం అభినందించుకున్నారు.20 గంటల కౌంట్ డౌన్ తరువాత ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 43నిముషాలకు, నింగికెగిసిన జీఎస్ఎల్వి మార్క్-3ఎం1 రాకెట్ 16 నిముషాల 13 సెకండ్ల పాటు ప్రయాణించి భూకక్షలోకి చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని విడిచిపెట్టింది. ఉపగ్రహం ప్రయాణదూరాన్ని అనుసరించి, సెప్టెంబర్ 7న చంద్రుని పై దిగనుంది.

ఇస్రో చైర్మన్ కే.శివన్ మాట్లాడుతూ ఇస్రో,భారతదేశం,మొత్తం ప్రపంచం ఈ మిషన్ కోసం ఎదురుచూస్తుందని చెప్పారు. ప్రయోగం తాము ఊహించిన దాని కంటే విజయవంతమైందని, ఇది భారతీయులకు చారిత్రాత్మక రోజు అని చెప్పారు. చంద్రయాన్ -2 ప్రయోగం విజయవంతంపై ప్రధాని మోడీ స్పందిస్తూ, మన అద్భుతమైన చరిత్రలో పొందుపరిచే ప్రత్యేకమైన క్షణాలు ఇవి అని అన్నారు. చంద్రయాన్ 2 యొక్క ప్రయోగం మన శాస్త్రవేత్తల పరాక్రమాన్ని మరియు సైన్స్ యొక్క కొత్త సరిహద్దులను కొలవడానికి 130 కోట్ల మంది భారతీయుల దృడ నిశ్చయాన్ని సూచిస్తుందని, ప్రతి భారతీయుడు ఈ రోజు ఎంతో గర్వపడుతున్నాడు అని చెప్పారు. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం పట్ల శాస్త్రవేత్తలు, ప్రజా పతినిధులు, సినిమా సెలబ్రిటీలు, ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

 

[subscribe]
[youtube_video videoid=wXhS2H1kYH0]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =