చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-2

chandrayaan 2, Chandrayaan 2 enters lunar orbit, chandrayaan 2 satellite latest news, Chandrayaan 2 successfully enters lunar, Chandrayaan 2 successfully enters lunar orbit, chandrayaan-2 successfully enters lunar transfer trajectory, indian space research organisation, isro, ISRO About Chandrayaan 2 Satellite, Latest National Political News Today, Mango News Telugu, National Political News 2019

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో మరో కీలక ఘట్టం విజయవంతమైంది. చంద్రయాన్-2 ఉపగ్రహం చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. ప్రయోగించిన 29 రోజుల తరువాత చంద్రయాన్-2 చంద్రుడి కక్ష్యలోకి చేరింది. మంగళవారం 8.30 నుంచి 9.30 గంటల మధ్యలో చంద్రయాన్-2 ఉపగ్రహన్నీ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయం 9.02 గంటలకు ప్రారంభించి, 1738 సెకండ్స్ పాటు కొనసాగించి అన్ని అంచనాలకు అందుకుని, కచ్చితత్వంతో కక్ష్యలోకి చేర్చారు.

చంద్రుడి కక్ష్యలోకి వెళ్లిన చంద్రయాన్-2 పై మరో నాలుగు విన్యాసాలు తరువాత చంద్రుడి దగ్గరగా ఉండే చివరి కక్ష్యలోకి వెళ్లనుంది. సెప్టెంబర్ 2న లాండర్ పై చేసే విన్యాసాల ద్వారా, చంద్రయాన్-2 ఉపగ్రహం నుండి ల్యాండర్ విక్రమ్ విడిపోతుందని ఇస్రో ఛైర్మన్ శివన్ తెలియజేసారు. సెప్టెంబర్ 7వ తేదీన ల్యాండర్ సాఫీగా ల్యాండ్ అవనుంది అని, ఉపగ్రహాన్ని చంద్రుడి కక్షలోకి ప్రవేశ పెట్టడం అత్యంత కష్టంతో కూడుకుందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారని చెప్పారు. ల్యాండర్ విడిపోయిన తరువాత 14 రోజులపాటు చంద్రుడిపై పయనించి అక్కడి నుంచి తీసిన డేటాను భూమిపైకి పంపనుంది.

[subscribe]
[youtube_video videoid=7hHtYnUQydw]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =