బిజెపి లో చేరిన కాంగ్రెస్ సభ్యులకు మంత్రి పదవులు ఇస్తున్న గోవా సీఎం

4 New Ministers Join Goa Cabinet, CM Pramod Sawant Latest News, Goa Cabinet: 3 MLAs who deserted Congress and 1 from BJP, Goa CM Pramod Sawant About Congress MLAs Induction Into Cabinet, Goa CM Pramod Sawant says swearing in of new cabinet ministers, Goa CM Pramod Sawant seeks resignation of 3 ministers, Goa CM Pramod Sawant to reshuffle Cabinet today, Mango News

ఇటీవలే గోవాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ కి రాజీనామా చేసి, కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని బిజెపిలో వీలీనం చేయాలనీ స్పీకర్ కి లేఖ ఇవ్వగా, స్పీకర్ వెంటనే ఆమోదించారు. ఈ నేపథ్యంలో జూలై 13న భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సి) లోని నలుగురు శాసనసభ సభ్యులను భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వ కేబినెట్‌లో తీసుకోనున్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన మంత్రివర్గంలో కాంగ్రెస్ కి చెందిన నాలుగు ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నట్టు ధ్రువీకరించారు. గోవా లో కాంగ్రెస్కి మొత్తం 15 మంది శాసన సభ్యులు ఉన్నారు. 10 మంది శాసనసభ్యుల రాజీనామాతో, కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం ఇప్పుడు 5 కి తగ్గింది.

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ, సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగుతున్న ముగ్గురు గోవా ఫార్వర్డ్ పార్టీ మంత్రులను మరియు స్వతంత్ర ఎమ్మెల్యే గెలిచి మంత్రి పదవి చేపట్టిన రోహన్ ఖాంటే ను మంత్రిపదవికి రాజీనామా చేయమని కోరానని తెలిపారు. బిజెపి నాయకత్వం ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. అయితే గోవా ఫార్వర్డ్ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం అయిన విజయ్ సర్దేశాయ్ స్పందిస్తూ, తమ మంత్రులెవరికి, ఈ నిర్ణయం పై సమాచారం లేదని, జరుగుతున్న ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

[subscribe]
[youtube_video videoid=nLxK0zs8oho]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =