కాంగ్రెస్ నాయకుడు చిదంబరానికి బెయిల్ నిరాకరణ

Chidambaram INX Media Case, Chidambaram INX Media Case Latest Updates, Delhi HC Refuses To Grant Bail To Chidambaram, HC Refuses To Grant Bail To Chidambaram, INX Media Case, INX Media Case Delhi HC Refuses To Grant Bail To Chidambaram, latest political breaking news, Mango News Telugu, national news headlines today, national news updates 2019, National Political News 2019

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి మరోసారి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. బెయిల్ మంజూరు చేయకూడదన్న సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. చిదంబరం బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయలేదు.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలు మాయమవడంపై అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఢిల్లీ హైకోర్టుకు గతంలోనే తెలియజేసారు. కస్టడీలో ఉన్న చిదంబరమే ఆధారాలు మాయం చేసారని కోర్టుకు విన్నవించారు. చిదంబరాన్ని ఆగస్టు 21 న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసింది. సీబీఐ విచారణ అనంతరం నిందితుడిగా ఉన్న చిదంబరాన్ని జ్యూడిషయల్ కస్టడీ లో భాగంగా తీహార్ జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం ఆయన బెయిల్ పిటిషన్ పెట్టుకోగా, సోమవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరిస్తునట్టు వెల్లడించింది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 11 =