కర్ణాటక రాజకీయ సంక్షోభం నేటితో ముగింపు?

Karnataka Floor Test Live Updates- Final Day For Political Crisis,Mango News,Karnataka Assembly Floor Test LIVE Updates - Two Independents holed up in Bengaluru flat say reports BJP - Congress clash outside building,Karnataka Crisis LIVE updates - I apologise to people CM Kumarswamy delivers concluding remarks before voting,Karnataka News,Karnataka Political News

కర్ణాటకలో జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్ ఈ రోజుతో తేలిపోనుంది. గత 20 రోజులుగా సాగుతున్న రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరుకున్నట్టే అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా సాయంత్రం ఆరుగంటల కల్లా బలపరీక్షను నిర్వహించాలని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష పై చర్చ జరుగుతుంది, ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు డీకే శివ కుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రసంగించారు. ఇప్పటివరకూ అసెంబ్లీలో తన గదిలోనే ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామి కూడ సభలోకి వచ్చారు. సాయంత్రం కుమారస్వామి ప్రసంగించిన తరువాత, సభలో ఓటింగ్ జరగనుంది.

ఈ రోజు జరుగుతున్న సభకు 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు, జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం గట్టెక్కాలంటే 103 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం, అయితే 15 మంది తిరుగుబాటు చేసిన కాంగ్రెస్, జెడిఎస్ ఎమ్మెల్యేలు ముంబయిలో ఉన్నారు, కుమారస్వామి ఎన్నిసార్లు అభ్యర్ధించిన కూడ ఓటింగ్ లో పాల్గొనడం లేదని తేల్చి చెప్పారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనారోగ్యంతో అసెంబ్లీ కి గైర్హాజరయ్యారు. ప్రస్తుతం సభలో నామినేటెడ్ ఎమ్మెల్యే మరియు స్పీకర్ ని మినహాయిస్తే అధికార జెడిఎస్-కాంగ్రెస్ కూటమికి 99 మంది సభ్యుల బలం ఉంది. ప్రభుత్వం విప్ పై నిర్దిష్టమైన సూచనలు కావాలని పట్టుబడుతుంటే, మరో వైపు బీజేపీ మాత్రం ఎలాగైనా బలపరీక్ష నిర్వహించాలనే డిమాండ్ చేస్తున్నారు. మరో రెండు గంటల్లో బలపరీక్ష జరిగే అవకాశం ఉంది, సభ్యుల బలం లేనందున ప్రభుత్వం పడిపోవచ్చనే పరిశీలకుల భావిస్తున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=IvdBcxaUTYc]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 15 =