కర్ణాటక బలపరీక్ష ఈ రోజైన జరుగుతుందా ?

Deadline 6 PM For Floor Test By Speaker, Floor Test Latest Updates, Karnataka Crisis Latest Updates, Karnataka Governor sets another deadline at 6 pm for Kumaraswamy, Karnataka Political Crisis Live Updates Speaker Announces 6 PM Deadline For Floor Test, Karnataka Political News, Mango News, Speaker Sets 6 PM Deadline For Floor Test

కర్ణాటక రాజకీయాలు మలుపులు తిరుగుతూ చివరి అంకానికి చేరుకున్నాయి. రెండు రోజుల విరామం తరువాత ఈ రోజు కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన రెండు గడువుల తరువాత, జెడిఎస్- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం జూలై 22 న బల పరీక్షను నిర్వహించబోతోంది. జూలై 20 న కర్ణాటక గవర్నర్ వాజు భాయ్ వాళా సాయంత్రం 6:00 గంటల కల్లా విశ్వాస పరీక్ష నిర్వహించాలని జెడిఎస్ ను కోరారు. అయితే, రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపైనా నిర్ణయం తీసుకోకపోవడం, ఆ సమయంలో 20 మంది శాసనసభ సభ్యులు సభలో లేకపోవడం గురించి ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల మధ్య జరిగిన వాదనలతో, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ బలపరీక్షను జూలై 22 కి వాయిదా వేశారు.

సభకు హాజరై ప్రభుత్వాన్ని కాపాడాలని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రెబెల్ ఎమ్మెల్యేలుకు మరోసారి విజ్ఞప్తి చేయగా, ఈ ప్రభుత్వం రాష్ట్రానికి మంచి చేస్తుందని మేము భావించాము,అది జరగలేదు కావున బలపరీక్ష కు హాజరయ్యే ప్రసక్తే లేదని ఎమ్మెల్యేలు కుమారస్వామి విజ్ఞప్తిని తిరస్కరించారు. ఈ నేపథ్యంలో జెడిఎస్- కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిని మార్చే అవకాశం కూడ ఉన్నట్టు సమాచారం,జెడిఎస్ ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉందని కాంగ్రెస్ నేత డీకే శివ కుమార్ ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య, పరమేశ్వర్ లేదా ట్రబుల్ షూటర్ డీకే శివ కుమార్ లలో ఎవర్నైనా సీఎం చేసేందుకు జెడిఎస్ సిద్దమయినట్టు తెలుస్తుంది.

అసమ్మతి నేతలపై సుప్రీం కోర్టులో కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు కోరకు నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యాహ్నం 3 నుంచి చర్చ ప్రారంభించి, సాయంత్రం 6 గంటలలోపు విశ్వాస పరీక్ష జరిగే అవకాశం ఉంది. ఈ గందరగోళం మరియు ఉద్రిక్తల నేపథ్యంలో, శివసేన పార్టీ నాయకులు మరియు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి,) అధ్యక్షురాలు మాయావతి ప్రస్తుత కర్ణాటక ప్రభుత్వానికి తమ మద్దతును తెలిపారు.

 

[subscribe]
[youtube_video videoid=mbJwWZwvo2Y]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =