గురువారం 11గంటలకు కర్ణాటకలో బలపరీక్ష

Govt In Karnataka To Face Trust Vote On Thursday, Govt to face floor test on Thursday, JDS Govt to Face Trust Vote on Thursday, Karnataka political crisis Kumaraswamy govt to face trust vote, Kumaraswamy Govt To Face Trust Vote On Thursday, Mango News, Yeddyurappa asks Karnataka CM HD Kumaraswamy to move trust Vote

కర్ణాటకలో జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం, ఎదురుకుంటున్న రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరుకుంటుంది. ఈ సంక్షోభం నుండి బయట పడడానికి ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష కి సిద్ధమేనని రెండు రోజుల క్రితం శాసనసభలో ప్రకటించన సంగతి తెలిసిందే.  అయితే అసమ్మతి నేతలు వెనక్కి తగ్గకపోవడంతో అవిశ్వాస తీర్మాన గండం నుండి ఈ ప్రభుత్వం బయటపడే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఎమ్మెల్యేల రాజీనామాతో ప్రభుత్వ బలం తగ్గిపోయిందని భాజపా, నేడు కుమారస్వామి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చింది, అందుకు సంబంధించిన నోటీసు స్పీకర్ కి అందజేశారు.

ముందుగా స్పీకర్ రమేష్ కుమార్, రాజీనామాలపై సుప్రీం కోర్టు నిర్ణయం తరువాతనే అవిశ్వాస తీర్మానం పై చర్చించి విశ్వాస పరీక్షను నిర్వహించాలని భావించారు, అయితే భాజపా ఆందోళనల దృష్ట్యా, సభను గురువారానికి వాయిదా వేసి, ఆ రోజు అవిశ్వాస తీర్మానం నోటీసు పై చర్చించనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమ సంకీర్ణ ప్రభుత్వం, గురువారం 11 గంటలకు అవిశ్వాస తీర్మానంపై చర్చించి, ఓటింగ్ నిర్వహిస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య ప్రకటించారు.

మరోవైపు అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, జెడిఎస్ నేతలు ముంబయిలో ఉన్న అసమ్మతి నేతల కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీని గురించి ముందుగానే సమాచారం అందుకున్న అసమ్మతి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతల నుండి వారికీ ముప్పు ఉందని మళ్ళీ ముంబయి పోలీసులను ఆశ్రయించారు. కర్ణాటక నుంచి వచ్చే ఏ నాయకులు, వారిని కలవకుండా రక్షణ కల్పించాలని లేఖ రాసారు. అటు కుమారస్వామి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు, ఇటు యడ్యూరప్ప ఆధ్వర్యంలో బిజెపి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు స్పీకర్ వద్దే ఉండడంతో, స్పీకర్ తమ రాజీనామాలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని అసమ్మతి ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. ఈ జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్తు ఒకటి రెండు రోజుల్లో ఒక దశకు చేరుకునే అవకాశం ఉంది.

 

[subscribe]
[youtube_video videoid=nU7eynV8eg0]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =