శశికళకు మరో షాక్, 1,600 కోట్ల ఆస్తుల జప్తు

latest political breaking news, Mango News Telugu, national news headlines today, national news updates 2019, Rs 1600 Crores Worth Sasikala Assets Seized, Sasikala Assets Of 1600 Crore Worth attached under the Benami Act, Sasikala Assets Seized, Sasikala’s assets attached under Benami Act, Sasikalas Assets Of 1600 Crore, Sasikalas Assets Of 1600 Crore Worth attached under the Benami Act

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు, అన్నాడీఎంకే నేత శశికళకు మరో షాక్ తగిలింది. శశికళకు చెందిన 1,600 కోట్ల రూపాయలు విలువజేసే ఆస్తులను ఐటీ అధికారులు నవంబర్ 5, మంగళవారం నాడు జప్తు చేశారు. బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద ఈ విలువైన ఆస్తులను జప్తు చేసినట్టుగా అధికారులు పేర్కొన్నారు. 2016 లో పెద్ద నోట్ల రద్దు తర్వాత శశికళ తన కుటుంబ సభ్యులుతో కలిసి ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అనంతరం 2017లో ఐటీ శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో మొదటిసారిగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా చెన్నై, పుదుచ్చేరి, కోయంబత్తూరులో ఉన్న మొత్తం తొమ్మిది రకాల ఆస్తులను జప్తు చేశారు. ఈ విషయంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో, ప్రస్తుతం బెంగళూరులోని అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు కూడ సమాచారాన్ని పంపినట్టు అధికారులు ధృవీకరించారు. ఐటీ అధికారులు జప్తు చేసిన ఆస్తుల్లో పెరంబూర్‌లోని ఓ మాల్, ఓ రిసార్ట్, మరియు కోయంబత్తూర్‌లో పేపర్ మిల్, చెన్నైలో ఉన్న స్పెక్ట్రమ్ మాల్, పుదుచ్చేరిలో శ్రీలక్ష్మి జువెలరీ పేరుతో ఉన్న ఓక రిసార్ట్‌ కూడ ఉన్నట్లు తెలుస్తుంది.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + three =