సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు

Chidambaram INX Media Case, Chidambaram INX Media Case Live Updates, Congress Leader P Chidambaram INX Media Case, Congress Leader P Chidambaram INX Media Case Live Updates, Former Finance Minister of India, INX Media case Live, Mango News Telugu, SC Rejects Chidambaram Anticipatory Bail Plea, SC Rejects Chidambaram Anticipatory Bail Plea In INX Media Case

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి సీబీఐ విచారణ ఎదురుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సెప్టెంబర్ 5 వరకు కస్టడీని కొనసాగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు సుప్రీంకోర్టులో చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కలిపించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది.

ఈ కేసులో చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టాలని ఈడీ తరపు న్యాయవాదులు చేసిన వాదనతో అత్యుత్తమ న్యాయస్థానం ఏకీభవించింది. ముందస్తు బెయిల్ ను అందరికి మంజూరు చేసే పరిస్థితి ఉండదని, వివిధ ఆర్థిక నేరాల దృష్ట్యా భిన్నంగా చూడాల్సిఉందని, తొలిదశలో బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తు ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అయితే ముందస్తు బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం, రెగ్యులర్ బెయిల్ కోసం ప్రత్యేక న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఈడీ అధికారులు సైతం ఆయనను విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=BGnfdu1iek0]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =