కర్ణాటక ఉప ఎన్నికల్లో ఓటమితో సీఎల్పీ పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య

BJP Leads In Karnataka, Congress Defeat In By-polls, Karnataka Bypoll Results, Karnataka Bypoll Results 2019, Karnataka Bypoll Results Updates, Karnataka Political News 2019, Karnataka Votes Counting, latest political breaking news, Mango News Telugu, national news headlines today, national news updates 2019, Siddaramaiah Resigns As CLP leader

కర్ణాటక రాష్ట్రంలో 15 శాసనసభ స్థానాలకు డిసెంబర్ 5న నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు జరిగింది. ఈ ఫలితాల్లో అధికార బీజేపీ అత్యధికంగా 12 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్‌ పార్టీ రెండు స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలిచారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎల్పీ నేతగా ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపినట్టుగా ప్రకటించారు. ‘కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతగా ప్రజా తీర్పును గౌరవిస్తున్నా. ఈ మేరకు సీఎల్పీ నేత పదవికి, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవికీ రాజీనామా చేశాను. నా రాజీనామాను సోనియా గాంధీకి పంపించాను’ అని సిద్ధరామయ్య తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. మరో వైపు కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు దినేష్‌ గుండూరావు కూడా ప్రకటించారు. తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపినట్లు తెలిపారు.

15 నియోజక వర్గాల్లో అథాని, ఎల్లాపూర్, కాగ్వాడ్, చిక్ బల్లాపూర్, కృష్ణరాజుపుర, హిరేకేరుర్, రాణెబెన్నూర్, కృష్ణరాజ్‌పూర్, మహాలక్ష్మి లేఅవుట్, విజయనగర, యశ్వంత్‌పూర్‌ మరియు గోకాక్ నియోజకవర్గాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ శివాజీ నగర్, హున్సూర్ నియోజకవర్గాలను దక్కించుకోగా, హస్కోటే లో స్వతంత్ర అభ్యర్థి శరత్ బాచే గౌడ గెలుపొందారు. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి పూర్తీ అనుకూలంగా ఉండడంతో కర్ణాటకలో మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రభుత్వానికి ఇకపై అడ్డంకులు తొలిగిపోయాయి. బీజేపీ గెలుపుతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు సంభరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ ఫలితాలపై స్పందిస్తూ 15 నియోజకవర్గాల్లో ప్రజల తీర్పును స్వీకరిస్తున్నామని, ఓటమిని అంగీకరిస్తున్నామని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీఎస్‌ ఈ ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘోర పరాభవాన్ని చవిచూసింది. 15 నియోజకవర్గాల్లో ఒక్క స్థానాన్ని కూడా జేడీఎస్ దక్కించుకోలేదు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − ten =