సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ఆకుల రమ్య లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘వీలునామా రాయడం ఎలా?’ అనే అంశం గురించి వివరించారు. తరతరాలుగా వారికీ వచ్చిన ఆస్తులు, సంపాదించిన స్వార్జితాలు తమ తదనంతరం ఎవరికీ చెందాలనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతుంటాయని చెప్పారు. ఉమ్మడికుటుంబ వ్యవస్థ అంతరించిన ఈ రోజుల్లో భవిష్యత్ పై చాలామందిలో భయం మొదలైందని అన్నారు. ఈనేపధ్యంలో తమ ఆస్తులు ఎవరికీ చెందాలనే అంశంపై ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయని తెలిపారు. వీలునామా రాయడానికి నిబంధనలేంటి? వీలునామా గొడవల్లో పరిష్కారమార్గాలకు సంబంధించి పలు విషయాలను ఈ ఎపిసోడ్లో ఆకుల రమ్య విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇