సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘ప్రాంక్ వీడియోస్ వలన కలిగే ఇబ్బందులు, దుష్పరిణామాలు’ గురించి వివరించారు. సమాచారం అందించడానికి, తెలుసుకోవడానికి వాడుకోవాల్సిన యూట్యూబ్ మాధ్యమాన్ని కొంతమంది ఫేక్ విషయాలతో, మరికొంత మంది ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ప్రాంక్ వీడియోస్ కోసం వాడుకుంటున్నారని చెప్పారు. ప్రాంక్ వీడియోలతో ఇబ్బంది పెట్టిన వ్యక్తులుపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అన్నారు. ప్రాంక్ వీడియోల ప్రభావం గురించి ఈ ఎపిసోడ్లో ఆకుల రమ్య గారు పూర్తీ స్థాయిలో విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇