ఆటో మొబైల్స్ రంగానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తన ‘నీలూ ఆర్ట్స్’ యూట్యూబ్ ఛానెల్ లో మోహన్ ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. ఈ ఛానల్ ద్వారా మార్కెట్లో కొచ్చే కొత్త బైక్/కార్లు వివరాలు, వాటిని వాడే విధానంలో సలహాలు, సూచనలను ముందస్తుగా తెలియజేస్తున్నారు. ఈ ఎపిసోడ్లో కొత్త బైక్ కొనేముందు చేయకూడని 10 తప్పులను వివరించారు. బైక్ యొక్క మైలేజ్, రీ-సేల్ వాల్యూ ముందుగా తెలుసుకోవాలని చెప్పారు. అంతేగాక మన అవసరానికి తగ్గ బైక్ ఎలా ఎంచుకోవాలో వివరించారు. ఏదైనా కొత్త బైక్ కొనేముందు దాని గురించి పూర్తి వివరాలు ఎలా తెలుసుకోవాలి, కొనాలని నిర్ణయించుకున్నాక పరిశీలించాల్సిన అంశాలేంటి అనే విషయాలపై ఈ వీడియోలో అందరికి అర్థమయ్యేలా విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
Subscribe to our Youtube Channel Mango News for the latest News.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


