తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1597 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 15, బుధవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 39,342 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 13,642 శాంపిల్స్ పరీక్షించగా 12,045 మందికి నెగటివ్ వచ్చినట్టుగా పేర్కొన్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 796, రంగారెడ్డిలో 212, మేడ్చల్ లో 115, సంగారెడ్డిలో 73, నల్గొండలో 58, వరంగల్ అర్బన్ లో 44, కరీంనగర్ లో 41, కామారెడ్డి లో 30, సిద్దిపేటలో 27, మంచిర్యాలలో 26, మహబూబ్ నగర్ లో 21, పెద్దపల్లిలో 20, మెదక్ లో 18, జయశంకర్ భూపాలపల్లిలో 15, సూర్యాపేటలో 14, నిజామాబాద్ లో 13, యాదాద్రి భువనగిరి లో 13 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (జూలై 15, సాయంత్రం 5 గంటల వరకు) :
రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 39,342
కొత్తగా నమోదైన కేసులు (జూలై 14 – జూలై 15 (5PM-5PM) : 1597
నమోదైన మరణాలు : 11
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 25,999
యాక్టీవ్ కేసులు : 12,958
మొత్తం మరణాల సంఖ్య : 386
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu