ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఈరోజు భారతీయ సంతతికి చెందిన యువతి వినీ రామన్‌ను వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా భారతీయ సంతతికి చెందిన వినీ రామన్‌తో మాక్స్వెల్ ప్రేమలో ఉన్నాడు. అయితే ఈ మధ్య తమిళంలో వీరి పెళ్లి కార్డు లీక్ కావడంతో గత కొన్ని రోజులుగా వీరి పెళ్లి గురించిన వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ కుటుంబానికి చెందిన వినీ రామన్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నారు. కాగా, వినీ రామన్, మాక్స్వెల్ ఫిబ్రవరి 2020లో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే మాక్స్వెల్ పెళ్లి చేసుకున్న వార్త గత నెలలో వారి వెడ్డింగ్ కార్డు ఇంటర్నెట్లో వైరల్ అయినప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. పూర్తిగా తమిళంలో రాసిన ఈ ఆహ్వాన పత్రికకు నెటిజన్లు ఫిదా అయ్యారు. దీనిని నిజం చేస్తూ ఈరోజు వారిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
The RCB family is incredibly happy for @vini_raman and @Gmaxi_32 on the beginning of this new chapter in their lives. 🥳🤩
Wishing you both all the happiness and peace, Maxi! ❤️🙌🏻 pic.twitter.com/RxUimi3MeX
— Royal Challengers Bangalore (@RCBTweets) March 19, 2022
కాగా మాక్స్వెల్ ఐపీల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతుండటం క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే. అయితే ఈ విషయాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా తన అధికారిక ట్విట్టర్ లో తెలిపింది. “ఈ వార్త పట్ల RCB కుటుంబం చాలా సంతోషంగా ఉంది. వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మీ ఇద్దరికీ సంతోషం మరియు శాంతి కలగాలని కోరుకుంటున్నాం” అని మాక్స్వెల్ ని ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టింది. మరోవైపు ఈ వివాహ వార్త తెలిసిన ఆస్ట్రేలియన్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ వంటి పలువురు క్రికెటర్లు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ