ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సతీమణి అన్నా లెజినోవా దంపతుల కీలక ప్రకటన

AP Deputy CM Pawan Kalyan and Wife Anna Lezhneva Announces Decide To Separate

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా తమ వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని సోమవారం రాత్రి ఇద్దరూ సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కొణిదెల, అన్నా కొణిదెల పేర్లతో ఈ ప్రకటన వెలువడింది.

Image

మంచి స్నేహితులుగా కొనసాగుతాం

తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగాన్ని కలిసి గడిపామని, ప్రస్తుతం పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. వైవాహిక జీవితం ముగిసినప్పటికీ మంచి స్నేహితులుగా, తమ పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. పిల్లల ఆనందం, భవిష్యత్తు, శ్రేయస్సు ఎప్పటికీ తమ ఉమ్మడి ప్రాధాన్యాల్లో ఉంటాయని తెలిపారు.

వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి

తమ వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పును అందరూ అర్థం చేసుకోవాలని, తమ ప్రైవసీని గౌరవించాలని పవన్, అన్నా కోరారు. ఇప్పటివరకు తమ ప్రయాణంలో అండగా నిలిచిన శ్రేయోభిలాషులు, సన్నిహితులు, అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here