డీఎస్సీ రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు తప్పనిసరి – ఏపీ పాఠశాల విద్యాశాఖ

AP DSC 2026 Department of School Education Clarifies Minimum Qualifying Marks Mandatory for Candidates

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించనున్న డీఎస్సీ-2026 రాత పరీక్షలో అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి అని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు వివిధ రిజర్వేషన్ వర్గాల వారీగా సాధించాల్సిన కనీస శాతం వివరాలను అధికారిక మార్గదర్శకాల్లో వెల్లడించింది.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) లో అభ్యర్థులు మెరిట్ జాబితాలో స్థానం సంపాదించాలంటే కేటగిరీల వారీగా ఈ క్రింది కనీస మార్కులను సాధించాల్సి ఉంటుంది:

  • ఓసీ (OC) మరియు ఈడబ్ల్యూఎస్ (EWS): 40 శాతం

  • బీసీ (BC – A, B, C, D, E): 35 శాతం

  • ఎస్సీ (SC – I, II, III), ఎస్టీ (ST) మరియు దివ్యాంగులు (PwBD): 30 శాతం

మాజీ సైనికోద్యోగులు మరియు క్రీడాకోటా అభ్యర్థులు తమకు వర్తించే కమ్యూనల్ కేటగిరీ ప్రకారమే కనీస అర్హత మార్కులను కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. అయితే కేవలం కనీస అర్హత మార్కులు సాధించినంత మాత్రాన ఉద్యోగం వస్తుందని హామీ ఉండదని, ఖాళీలు మరియు తుది మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here