రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

AP Dy Pawan Kalyan Says, We Will Fight Only If Opponents Cross The Line

కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన రాయలసీమ అభివృద్ధి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి ‘జల్‌ జీవన్‌ మిషన్‌’, ‘అమరజీవి జలధార’ పథకాలను ప్రారంభించిన అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. వారి ఆవేశం తనకు అర్థమవుతోందని అన్నారు. అయితే అభివృద్ధి కార్యక్రమాల వేదికపై రాజకీయాలు మాట్లాడటం సరికాదని స్పష్టం చేశారు.

ప్రత్యర్థి హద్దు మీరితేనే..

రాయలసీమ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సభలో రాజకీయ విమర్శలకు తావివ్వకూడదని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. “యుద్ధం వచ్చినప్పుడే మాట్లాడాలి.. ప్రత్యర్థి హద్దు మీరితేనే యుద్ధం చేస్తాం” అని వ్యాఖ్యానించారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.

వైసీపీ పాలనపై విమర్శలు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు ప్రాజెక్టులు పూర్తికాలేదని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జల్‌ జీవన్‌ మిషన్‌ను కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

కేంద్ర సహకారంతో అభివృద్ధి

కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో గతంలో లేని స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు రూ.6 వేల కోట్లతో పనులు చేపట్టినట్లు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here