దేశంలోనే అతి పెద్ద యుద్ధ నౌకకు ‘ఉదయగిరి’ పేరు.. రాజ్‌నాథ్‌ సింగ్‌కు ధన్యవాదాలు తెలిపిన మేకపాటి

AP Ex-MP Mekapati Rajamohan Reddy Thanks Union Minister Rajnath Singh on Named Udayagiri To India's Big War Ship, Ex-MP Mekapati Rajamohan Reddy Thanks Union Minister Rajnath Singh on Named Udayagiri To India's Big War Ship, Former MP Mekapati Rajamohan Reddy Thanks Union Minister Rajnath Singh on Named Udayagiri To India's Big War Ship, Mekapati Rajamohan Reddy Thanks Union Minister Rajnath Singh on Named Udayagiri To India's Big War Ship, Udayagiri To India's Big War Ship, Mekapati Rajamohan Reddy Thanks Union Minister Rajnath Singh, Union Minister Rajnath Singh, Minister Rajnath Singh, Rajnath Singh, AP Former MP Mekapati Rajamohan Reddy, Ex-MP Mekapati Rajamohan Reddy, Mekapati Rajamohan Reddy, Ex-MP Rajamohan Reddy, Udayagiri Named To India's Big War Ship News, Udayagiri Named To India's Big War Ship Latest News, Udayagiri Named To India's Big War Ship Latest Updates, Udayagiri Named To India's Big War Ship Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో.. నెల్లూరు జిల్లా లోని ‘ఉదయగిరి’ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చారని, అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొన్నారు. వివరాలలోకి వెళ్తే.. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు భారీ యుద్ధ నౌకలను కేంద్ర మంత్రి మంగళవారం ముంబైలో ప్రారంభించారు. వీటిలో ఒకటి ఇప్పటివరకు దేశంలోనే ఉన్న యుద్ధ నౌకలన్నింటిలోకెల్లా చాలా పెద్దది.

అయితే ఈ భారీ యుద్ధ నౌకకు ఉదయగిరి అని పేరు పెట్టడం విశేషం. దీంతో నెల్లూరు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ రక్షణకు ఉపయోగపడే యుద్ధ నౌకకు తమ ప్రాంతమైన ‘ఉదయగిరి’ పేరు పెట్టడం తమకు, తమ జిల్లా ప్రజలకు గర్వకారణమని సంతోషాన్ని తెలియజేస్తున్నారు. దీనిపై నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కూడా తన హర్షాన్ని తెలియపరుస్తూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు. ఉదయగిరిలోని అతిపెద్ద పర్వతాలను పరిగణనలోకి తీసుకుని దేశంలోనే అతి పెద్ద యుద్ధ నౌకకు ఆ పేరు పెట్టడం మా జిల్లా ప్రజలకు గర్వకారణమని, దీనికి ప్రత్యేక కృతఙ్ఞతలు అని లేఖలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − eight =