ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏపీపీఎస్సీ ద్వారా 243 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ

AP Govt Issued Orders For The Recruitment of 243 Anganwadi Posts Through APPSC,AP Govt Issued Orders For The Recruitment,Recruitment of 243 Anganwadi Posts,243 Anganwadi Posts Through APPSC,AP Govt Recruitment of 243 Anganwadi Posts,Mango News,Mango News Telugu,WDCW AP Anganwadi Recruitment 2023,AP Anganwadi Recruitment 2023,AP Anganwadi Supervisor Recruitment 2023,AP Anganwadi Posts Latest News,Anganwadi Posts Latest Updates,AP Anganwadi Posts News Today

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మొత్తం 243 పోస్టులను భర్తీ చేయనున్న ప్రభుత్వం.. వీటిని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక దీనికి సంబంధించిన నియామక నోటిఫికేషన్‌ త్వరలో విడుదల చేయనున్నారు. అలాగే విద్యార్హతలు, నియామక విధానం, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో వివరించనున్నారు. కాగా మొత్తం 243 పోస్టుల్లో.. 61 చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (సీడీపీవో), అసిస్టెంట్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (ఏసీడీపీవో), మహిళా-శిశు సంక్షేమ అధికారి, రీజినల్‌ మేనేజర్‌ పోస్టులు, 161 గ్రేడ్‌–1 సూపర్‌వైజర్‌ పోస్టులు, 21 శిశు సంరక్షణ కేంద్రాల సూపరింటెండెంట్‌ పోస్టులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + five =