ఆంధ్రప్రదేశ్‌కు ‘అర్నబ్’ తుఫాన్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావం ఉండే తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు రాష్ట్రస్థాయితో పాటు ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
తుఫాన్ సంబంధిత సమస్యలకు వేగంగా పరిష్కారం పొందేందుకు మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009ను వినియోగించుకోవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070, 1800 425 0101ను సంప్రదించాలని సూచించారు.
జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు తమ జిల్లాకు సంబంధించిన నంబర్లను దగ్గర ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో అధికారులను సంప్రదించేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయి.
| జిల్లా | కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు |
|---|---|
| శ్రీకాకుళం | 08942240557 |
| విజయనగరం | 8922236947 |
| పార్వతీపురం మన్యం | 08963450347 |
| అల్లూరి సీతారామరాజు | 8935293448 |
| విశాఖపట్నం | 0891-2590102 / 0891-2590100 |
| అనకాపల్లి | 08924-222888 / 08924-226599 / 08924-225999 |
| కాకినాడ | 0884-2356801 / 9849903879 |
| కోనసీమ | 8856293104 |
| తూర్పు గోదావరి | 8832944455 |
| పశ్చిమ గోదావరి | 08816-299181 |
| ఏలూరు | 18002331077 / 9494041419 |
| పోలవరం | 18004254225 |
| తిరుపతి | 0877 2236007 |
| మార్కాపురం | 9248702500 |
| కృష్ణా | 08672 252399 |
| ఎన్టీఆర్ | 9154970454 |
| గుంటూరు | 0863-2234014 |
| బాపట్ల | 08643-220226 |
| ప్రకాశం | 08592 295600 / 18004250277 |
| నెల్లూరు | 7995576699 |
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, అవసరమైనప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా సంబంధిత కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలి. తుఫాన్ సమాచారం, వాతావరణ హెచ్చరికల కోసం అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలి.








































