ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న కార్పొరేషన్స్, మున్సిపాలిటీల వివరాలు

AP Municipal Elections , YSRCP Wins 11 Corporations 73 Municipalities, 2021 Andhra Pradesh Municipal Elections Results, Andhra Pradesh Municipal Elections Results, Andhra Pradesh Municipal Elections Results 2021, Andhra Pradesh Municipal Elections Results News, Andhra Pradesh Municipal Elections Results Updates, Andhra Pradesh Municipal Elections-2021 Results Live, Andhra Pradesh Municipal Elections-2021 Results Live Updates, Andhra Pradesh Municipal Elections-2021 Results Updates, AP Municipal Elections Results, Mango News, Municipal Elections Results In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో “ఫ్యాన్‌” హవానే కొనసాగించి, ఏపీ మున్సిపల్ ఎన్నికల చరిత్రలోనే సంచలన ఫలితాలను నమోదు చేసింది. విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ), విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహా మొత్తం 11 కార్పొరేషన్స్ ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. హైకోర్టు ఆదేశాలు ఉండడంతో ఏలూరు కార్పొరేషన్ ఫలితాలను వెల్లడించలేదు.

అలాగే 13 జిల్లాలలోని 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో 73 చోట్ల పూర్తీ మెజార్టీతో విజయాన్ని నమోదు చేసింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. కేవలం తాడిపత్రి, మైదుకూరు మున్సిపాలిటీల్లోనే అత్యధిక వార్డులు గెలుచుకోగలిగింది. తాడిపత్రిలో మొత్తం 36 వార్డుల్లో టీడీపీ 18, వైఎస్సార్సీపీ 16, సీపీఐ 1, ఇతరులు 1 గెలుచుకున్నారు. అలాగే మైదుకూరులో టీడీపీ 12, వైఎస్సార్సీపీ 11, జనసేన ఒక వార్డు గెలుచుకున్నాయి. కాగా మైదుకూరులో కూడా ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో చైర్ పర్సన్ పదవిని వైఎస్సార్సీపీ దక్కించుకునే అవకాశం ఉంది.

వైఎస్సార్సీపీ గెలుచుకున్న కార్పొరేషన్స్ జాబితా:

  1. విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)
  2. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్
  3. విజయనగరం
  4. ఒంగోలు
  5. చిత్తూరు
  6. తిరుపతి
  7. మచిలీపట్నం
  8. గుంటూరు
  9. కర్నూలు
  10. కడప
  11. అనంతపురం

వైఎస్సార్సీపీ గెలుచుకున్న మున్సిపాలిటీలు/నగర పంచాయతీల జాబితా:

కృష్ణా జిల్లా:

  • ఉయ్యూరు
  • నందిగామ
  • నూజివీడు
  • పెడన
  • తిరువూరు

గుంటూరు జిల్లా:

  • తెనాలి
  • చిలకలూరిపేట
  • రేపల్లె
  • సత్తెనపల్లి
  • వినుకొండ
  • మాచర్ల
  • పిడుగురాళ్ల

ప్రకాశం జిల్లా:

  • చీరాల
  • మార్కాపురం
  • అద్దంకి
  • చీమకుర్తి
  • కనిగిరి
  • గిద్దలూరు

పశ్చిమగోదావరి జిల్లా:

  • నరసాపురం
  • నిడదవోలు
  • కొవ్వూరు
  • జంగారెడ్డిగూడెం

తూర్పుగోదావరి జిల్లా:

  • అమలాపురం
  • తుని
  • పిఠాపురం
  • సామర్లకోట
  • రామచంద్రావురం
  • మండపేట
  • పెద్దాపురం
  • ఏలేశ్వరం
  • గొల్లప్రోలు
  • ముమ్ముడివరం

నెల్లూరు జిల్లా:

  • వేంకటగిరి
  • ఆత్మకూరు
  • సూళ్లూరుపేట
  • నాయుడుపేట

కడప జిల్లా:

  • పొద్దుటూరు
  • పులివెందుల
  • జమ్మలమడుగు
  • బద్వేలు
  • రాయచోటి
  • ఎర్రగుంట్ల

కర్నూల్ జిల్లా:

  • ఆదోని
  • నంద్యాల
  • ఎమ్మిగనూరు
  • డోన్
  • నందికొట్కూరు
  • గూడూరు
  • ఆళ్లగడ్డ
  • ఆత్మకూరు

చిత్తూరు జిల్లా:

  • మదనపల్లె
  • పుంగనూరు
  • పలమనేరు
  • నగరి
  • పుత్తూరు

అనంతపురం జిల్లా:

  • హిందూపురం
  • గుంతకల్లు
  • ధర్మవరం
  • కదిరి
  • రాయదుర్గం
  • గుత్తి
  • కళ్యాణదుర్గం
  • పుట్టపర్తి
  • మడకశిర

శ్రీకాకుళం జిల్లా:

  • ఇచ్చాపురం
  • పలాస-కాశీబుగ్గ
  • పాలకొండ

విజయనగరం జిల్లా:

  • బొబ్బిలి
  • పార్వతీపురం
  • సాలూరు
  • నెల్లిమర్ల

విశాఖపట్నం జిల్లా:

  • నర్సీపట్నం
  • ఎలమంచిలి

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 20 =