బిగ్ బాస్ తెలుగు 6: టైటిల్ గెలుచుకున్న సింగర్ రేవంత్.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన హోస్ట్ అక్కినేని నాగార్జున

Bigg Boss Telugu 6 Host Nagarjuna Declares Singer Revanth Wins in Grand Finale But Runner Up Shrihan Gets More Prize Money,Revanth Bigg Boss Winner,Shrihan Bigg Boss 6 Runnerup,Bigg Boss 6 Telugu Voting,Mango News,Mango News Telugu,Bigg Boss 6 Telugu Runner Up,Bigg Boss 6 Telugu In Hotstar,Bigg Boss 6 Telugu Full Episodes,Bigg Boss 6 Telugu Contestants,Bigg Boss 6 Telugu Live,Bigg Boss 6 Telugu Episode 1,Bigg Boss 6 Telugu Elimination,Bigg Boss 6 Telugu Contestants,Bigg Boss 6 Telugu Voting Results Today,Bigg Boss 6 Telugu Full Episode,Bigg Boss 6 Telugu Runner Prize Money,Bigg Boss Season 6 Winner,Bigg Boss Winner,Bigg Boss 6 Telugu Winner,Bigg Boss 6 Grand Finale

106 రోజుల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ‘బిగ్ బాస్’ తెలుగు 6 విజేత ఎవరో తేలిపోయింది. ఆదివారం రాత్రి కోట్లాది ప్రేక్షకుల తీవ్ర ఉత్కంఠ మధ్య సింగర్ ఎల్‌వీ రేవంత్ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్నట్లు హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించారు. అతనికి చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చిన శ్రీహాన్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రేవంత్.. శ్రీహన్, ఆది రెడ్డి, కీర్తి భట్ మరియు రోహిత్ సాహ్నిని ఓడించి బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. దీంతో రేవంత్ ఇంతకుముందు సీజన్లలో బిగ్ బాస్ టైటిల్స్ గెలుచుకున్న శివబాలాజీ, కౌశిక్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, వీజే సన్నీ తదితరుల సరసన చేరాడు.

తద్వారా రేవంత్ రూ. 10 లక్షల ప్రైజ్ మనీతో పాటు రూ.25 లక్షల ఇంటిస్థలం గెలుచుకున్నాడు. అయితే ఈ క్రమంలో నాగార్జున చివర్లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. రేవంత్ కంటే శ్రీహన్‌కు అత్యధికంగా ప్రేక్షకుల ఓట్లు వచ్చాయని వెల్లడించారు. అయితే, విన్నర్‌ పేరును ప్రకటించడానికి ముందు నాగార్జున ఇచ్చిన ప్రత్యేక ‘బ్రీఫ్ కేస్’ ఆఫర్‌‌కు శ్రీహాన్ ఓకే చెప్పడంతో రేవంత్ గెలిచినట్లు ప్రకటించారు. తన తండ్రి మరియు ఇతర హౌస్ మేట్స్ సూచన మేరకు శ్రీహాన్ టైటిల్ రేసు నుంచి తప్పుకునేందుకు రూ. 40 లక్షలు తీసుకోవడానికి ఒప్పుకోవడంతో రన్నరప్‌గా నిలిచాడు. ఇక టైటిల్ విన్నర్ రేవంత్ కంటే శ్రీహన్ ఎక్కువ మొత్తం గెలుచుకోవడం విశేషం.

సెప్టెంబర్ 4వ తేదీన 21 మంది పోటీదారులతో ప్రారంభమైన ఈ సీజన్.. ఆద్యంతం ఆసక్తిగా సాగింది. 106 రోజుల పాటు సాగిన ఈ షోలో పార్టిసిపెంట్స్ మధ్య చోటుచేసుకున్న కొన్ని సరదా సంఘటనలు నవ్వు తెప్పించగా, మరికొన్ని ఘటనల్లో కన్నీళ్లు పెట్టుకోవడం వంటివి కనిపించాయి. నిన్న రాత్రి జరిగిన ఈ ఫైనల్‌లో ప్రముఖ టాలీవుడ్ నటుడు రవితేజ మరియు శ్రీలీల, కార్తికేయ 2 ఫేమ్ నిఖిల్ సిద్ధార్థ తదితరులు ప్రత్యేక అతిథులుగా వచ్చారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తన నృత్యాలతో అందరినీ అలరించింది. ఇక ఈ షోకి హోస్ట్‌గా టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున మరోసారి అలరించారు. ఆయన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుండి కొనసాగుతున్నారు. అంతకుముందు టాలీవుడ్ యంగ్ హీరో నాని రెండవ సీజన్‌కు యాంకరింగ్ చేయగా.. మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌ చేయడం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 10 =