తెలంగాణలో రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల, మే 30న పోలింగ్

ECI Announces Bye Election Schedule for Rajya Sabha Seat in Telangana Polling to be held on May 30th, Telangana Rajya Sabha Election, Election Commission of India has announced schedule for by-election to the vacant Rajya Sabha seat in Telangana, vacant Rajya Sabha seat in Telangana, Election Commission of India, Bye Election Schedule for Rajya Sabha Seat in Telangana, Rajya Sabha Seat Bye Election, Bye Election, Rajya Sabha Bye Election, Telangana Rajya Sabha Seat, Rajya Sabha Seat, Rajya Sabha Bye Election News, Rajya Sabha Bye Election Latest News, Rajya Sabha Bye Election Latest Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నాడు షెడ్యూల్ ను విడుదల చేసింది. రాష్ట్రంలో గత నవంబర్ లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న బండ ప్రకాష్ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో బండ ప్రకాష్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ స్థానంలో ప్రస్తుతం ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.

బండ ప్రకాష్ రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 2, 2024 వరకు ఉండగా, డిసెంబర్ 4, 2021న రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో ఏర్పడ్డ ఈ ఖాళీని భర్తీ చేసేందుకు ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ స్థానానికి మే 30వ తేదీన ఉపఎన్నిక జరుగుతుందని, ఓట్ల లెక్కింపు పక్రియ కూడా అదే రోజున జరుగుతుందని తెలిపారు.

తెలంగాణ రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్:

  • ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల: మే 12
  • నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు: మే 19
  • అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన: మే 20
  • నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: మే 23
  • పోలింగ్‌ నిర్వహణ: మే 30 (ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌)
  • ఓట్ల లెక్కింపు పక్రియ: మే 30 (సాయంత్రం 5 గంటల నుంచి).

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =