భారతీయ సమాజం వైద్యులను భగవంతుడితో పోలుస్తుంది – పవన్ కళ్యాణ్

Happy Doctor’s Day 2021 Wishes, Janasena President, Janasena President Pawan Kalyan, Janasena President Pawan Kalyan Greeted Doctors on the Occasion of National Doctor’s Day, Mango News, National Doctor Day, National Doctors Day, National Doctors Day 2021, pawan kalyan, Pawan Kalyan Greeted Doctors on the Occasion of National Doctor’s Day, PM Modi, telangana, Telangana CM greets Doctors on national Doctor’s day

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ విపత్కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్య సేవలో నిమగ్నమైన వారియర్స్ మన వైద్యులు. నిబద్ధతతో వైద్యం అందిస్తున్నారు. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి వైద్యుడికీ నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. కరోనా వైరస్ పీడిస్తున్న ఈ సమయంలోనే కాదు. ఎల్లప్పుడూ అంకిత భావంతో వృత్తి ధర్మాన్ని పాటించే వైద్యులు ఎందరో ఉన్నారు. మన భారతీయ సమాజం వైద్యులను భగవంతుడితో పోలుస్తుంది. పేదలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ వైద్య నారాయణులు అనే భావనను మరింత ఇనుమడింపజేస్తారని కోరుకొంటున్నాను. గ్రామీణ, అటవీ ప్రాంతాలకు వైద్య సేవలు చేరేలా కృషి చేయాల్సిన బాధ్యత యువ వైద్యులపై ఉంది. వైద్యులను గౌరవిస్తూ వారిపై ఇతరుల పెత్తనం లేకుండా చూడటం రాష్ట్ర ప్రభుత్వ విధి. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =