పుట్టినరోజున కలవడంపై అభిమానులకు నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి

Balakrishna Happy Birthday, Happy Birthday Nandamuri Balakrishna, Hindupur MLA Nandamuri Balakrishna, Mango News, Nandamuri Balakrishna, Nandamuri Balakrishna Appeals Fans to Avoid Wishing him in Person, Nandamuri Balakrishna Appeals Fans to Avoid Wishing him in Person on his Birthday, Nandamuri Balakrishna Appeals Fans to Avoid Wishing him in Person on his Birthday on June 10, Nandamuri Balakrishna birthday, Nandamuri Balakrishna Happy Birthday, Nandamuri Balakrishna requests fans to avoid wishing him

ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో జూన్ 10న తన పుట్టినరోజు సందర్భంగా కలిసేందుకు రావొద్దని ప్రముఖ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “నా ప్రాణ సమానులైన అభిమానులకు, ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు, నన్నింతటివాడ్ని చేసింది మీఅభిమానం, ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబంతో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక. దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ, ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానులకూ, కార్యకర్తలకూ, అభాగ్యులందరికీ నివాళులర్పిస్తున్నాను” అని బాలకృష్ణ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here