కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు

PM Modi Along with Several Film and Political Celebrities Extends Condolences For The Demise of Legendary Director K Vishwanath,PM Modi Condolences,Legendary Director Actor K Viswanath,Mango News,Mango News Telugu,K Viswanath Movies,K Viswanath Young,K Viswanath Wikipedia,K. Viswanath Son,K Viswanath Last Movie,K Viswanath Age,K Viswanath Songs,K Viswanath Super Hit Movies,K Viswanath Best Movies,K Viswanath Movies Hits And Flops List,K Viswanath Family Photos,K Viswanath Kamal Hassan Movies,K Viswanath Chiranjeevi Movies,K Viswanath Young Photos,Director K Viswanath,Kamal Haasan And K Viswanath Movies,Kashi Vishwanath,Kavita Viswanath,Kashi Vishwanath Temple,Kasi Viswanath Director,Kavita Viswanath And Gavaskar,Kashi Vishwanath Images Hd,Kasinathuni Viswanath,Kashi Vishwanath Corridor

తెలుగు చిత్ర దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, నటుడు కమల్ హాసన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తదితరులు ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు. విశ్వనాథ్ మృతిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ‘శ్రీ కె. విశ్వనాథ్ గారు మృతి చెందడం బాధాకరం. అతను ఒక సృజనాత్మక మరియు బహుముఖ దర్శకుడిగా తనని తాను ప్రత్యేకం చేసుకున్న సినీ ప్రపంచంలోని ప్రముఖుడు. అతని సినిమాలు దశాబ్దాలుగా వివిధ శైలులను మరియు ప్రేక్షకులను ఆకర్షించాయి. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతి. ఓం శాంతి’ అని పేర్కొన్నారు.

ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కూడా విశ్వనాథ్ మృతి వార్త విని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ట్విట్టర్‌లో ఇలా పేర్కొన్నారు.. ‘కె. విశ్వనాథ్ గారు ఒక చలనచిత్ర-దర్శకుడిగా అతను ఒక సందేశంతో తన సినిమాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపును మరియు గౌరవాన్ని తెచ్చారు. అతని ఆత్మ సద్గతిని పొందుగాక! ఓం శాంతి!’ అని తెలియజేశారు.

కె. విశ్వనాథ్ మృతిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందిస్తూ.. ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ కె. విశ్వనాథ్‌గారి మరణం గురించి విని చాలా బాధపడ్డాను. శంకరాభరణం, స్వాతి ముత్యం, సాగర సంగమం మొదలైన కళాతపస్వి దర్శకత్వం వహించిన క్లాసిక్‌లు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. భారతీయ సినిమా ఓ మేధావిని కోల్పోయింది’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + three =