ప్రముఖ తమిళ నటుడు విక్రమ్‌కు ప్రమాదంలో తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

Tamil Star Hero Chiyaan Vikram Got Severe Injury During The Action Scenes Shooting For Film Thangalaan,Tamil Star Hero Chiyaan Vikram Got Severe Injury,Severe Injury During The Action Scenes Shooting,Action Scenes Shooting For Film Thangalaan,Tamil Star Hero Chiyaan Vikram Film Thangalaan,Mango News,Mango News Telugu,Vikram sustains rib injury,Chiyaan Vikrams Thangalaan shooting,Chiyaan Vikram Severe Injury Latest News,Chiyaan Vikram A Tragic Accident,Hero Chiyaan Vikram Latest News and Updates,Chiyaan Vikram Injury News Today

ప్రముఖ తమిళ నటుడు ‘చియాన్’ విక్రమ్ ప్రమాదం బారిన పడ్డారు. ‘తంగాళన్’ అనే సినిమా షూటింగ్ సమయంలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణకు రిహార్సల్ చేస్తుండగా ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విక్రమ్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. దీంతో చిత్ర యూనిట్ ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే విక్రమ్‌కు పక్కటెముక విరిగినట్లుగా గుర్తించిన వైద్యులు, ఆపరేషన్ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో.. విక్రమ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడి ఆపరేషన్ నిర్వహించడం కోసం అంగీకరించారు. దీంతో వైద్యులు విక్రమ్‌కు ముందస్తుగా మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. కాగా ‘పా రంజిత్’ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ విభిన్న పాత్రను పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఇటీవలే విడుదలైన పొన్నియిన్ సెల్వన్ – పార్ట్ 2లో ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్ తనదైన నటనతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 1 =