తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి హ్యాకర్స్ షాక్ ఇచ్చారు. ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేశారు. ఈమేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం ప్రకటించారు. టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని, హ్యాకర్లు ట్విట్టర్ హ్యాండిల్లో వివిధ పోస్ట్‌లను పెడుతున్నారని వెల్లడించారు. అయితే, దీనిపై ట్విట్టర్ ఇండియాను సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఈ అకౌంట్‌ని రికవరీ చేయడానికి పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని లోకేష్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
Kindly note that our official party account @jaitdp has been hacked by nefarious elements. We are working with @TwitterIndia to restore the account.
— Lokesh Nara (@naralokesh) March 19, 2022
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవుతున్నవారికి కొన్ని విచిత్రమైన పోస్టులు కనిపిస్తున్నాయి. టీడీపీ ట్విట్టర్ ఖాతాలో స్పేస్ ఎక్స్ కు సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ కు చెందిన స్టార్‌బేస్ చిత్రాలను చూపుతోంది. అయితే ప్రస్తుతం ఏపీలో పెగాసస్ స్పై వేర్ వ్యవహారంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవడం చర్చనీయాంశమైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ