మార్చి 22న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం, మార్చి 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు: టీటీడీ

TTD to Held Ugadi Asthanam at Tirumala Srivari Temple on March 22 VIP Break Darshans Cancelled on March 21 22,TTD to Held Ugadi Asthanam,Tirumala Srivari Temple,Ugadi Asthanam on March 22,VIP Break Darshans Cancelled,VIP Darshans on March 21 and 22 Cancelled,Mango News,Mango News Telugu,TTD cancels VIP break darshan,Tirumala Tirupati Devasthanams,TTD Latest News and Updates,TTD Live News,TTD Ugadi Asthanam News Updates,Tirumala Break Darshans Latest News

తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని టీటీడీ పేర్కొంది. ఈ మేరకు టీటీడీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంల‌ను రద్దు చేస్తునట్టు టీటీడీ తెలిపింది. అలాగే మార్చి 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తిరుమల శ్రీ‌వారి ఆలయంలో మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 22న ఉగాది ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా మార్చి 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలను ర‌ద్ధు చేస్తున్నాం. ఈ కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 13 =