ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత, నెల్లూరు ఆస్పత్రికి తరలింపు

Udayagiri YSRCP MLA Mekapati Chandrasekhar Reddy Admitted To Hospital at Nellore Due To Severe Illness,Udayagiri YSRCP MLA Mekapati Chandrasekhar Reddy,YSRCP MLA Mekapati Chandrasekhar Reddy,Mekapati Chandrasekhar Reddy,Mango News,Mango News Telugu,Ycp Mla Chandrasekhar Reddy,Mekapati Chandrasekhar Reddy Wife,Mekapati Chandrasekhar Reddy Son,Mekapati Chandrasekhar Reddy Second Wife,Mekapati Chandrasekhar Reddy First Wife,Mekapati Chandrasekhar Reddy Family Photos,Mekapati Chandrasekhar Reddy Family,Mekapati Chandrasekhar Reddy Daughter,Mekapati Chandrasekhar Reddy Wikipedia,Ysrcp Reddy Mla List,Ysrcp Mla Phone Numbers,Ysrcp Mla Kethireddy Venkatarami Reddy,Ysrcp Mla Contact Number,Ysrcp Mla Chirla Jaggireddy

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా ఎమ్మెల్యే మేకపాటికి గుండె రక్తనాళాల్లో రెండుచోట్ల వాల్వ్స్ బ్లాక్ అయినట్లు గుర్తించిన వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే ఆయన పరిస్థితి కొంచెం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మేకపాటికి గుండెకు సంబంధించి కొన్ని పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. రిపోర్ట్స్ వచ్చాక పరిస్థితిని బట్టి వైద్యులు సూచన మేరకు ఆయనను మెరుగైన వైద్యం కోసం చెన్నై కానీ, హైదరాబాద్ కానీ తరలించడానికి కుటుంబ సభ్యులు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 14 =