సవాళ్లు-ప్రతి సవాళ్లు.. వేడెక్కుతున్న గుడివాడ రాజకీయం

1214 players register for IPL 2022 mega auction, 1214 players register for IPL 2022 Player Auction, 896 Indian and 318 Overseas Players Registered, 896 Indians amongst 1214 players registered for IPL 2022, 896 Indians amongst 1214 players registered for IPL 2022 auction, IPL 2022, IPL 2022 Player Auction, IPL 2022 Player Mega Auction, IPL Auction, IPL News, IPLT20, List of players in IPL auction 2022, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కుతోంది. మంత్రి కొడాలి నాని వర్సెస్ టీడీపీ నేతల మధ్య అగ్గి రాజుకుంటోంది. గుడివాడ కే కన్వెన్షన్‌‌లో జరిగినట్లుగా చెబుతున్న కేసినోతో తనకు సంబంధం లేదని మంత్రి కోడలి నాని స్ఫష్టం చేశారు. అది తనదేనని నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటానని శుక్రవారం కొడాలి నాని సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ సవాల్‌పై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ స్పందించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని సవాల్‌కు తాము సిద్దమే అన్నారు. కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్‌‌లోనే కేసినో నిర్వహించారని.. తమ ఆరోపణలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

గుడివాడ కేసినోపై అన్ని ఆధారాలున్నాయన్నారు. తామే పెట్రోల్ డబ్బా తెస్తామన్నారు. మేము చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతే తగులబెట్టుకుంటామని స్పష్టం చేశారు. తాము నిరూపిస్తే మాత్రం కొడాలి నాని తగులబెట్టుకోవాలన్నారు. డేట్, టైమ్ కొడాలి ఫిక్స్‌ చేసినా సరే.. మమ్మల్ని ఫిక్స్ చేయమన్నా సరే అంటూ బోండా ఉమ సవాల్ విసిరారు. కే కన్వెన్షన్ తనిఖీకి వెళ్తే ప్రభుత్వం వణికిపోయిందన్నారు. ఏ తప్పు చేయకుంటే నిజ నిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారంటూ మంత్రిని నిదీశారు ఉమ. అశ్లీల నృత్యాలు జరుగుతుంటే పోలీసులకు చెప్పి ఆపించానని మంత్రి స్వయంగా ఒప్పుకున్నారు. దీంతోనే అక్కడ కేసినో నిర్వహించారని తేటతెల్లమైంది అని బోండా ఉమా అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =