బెయిల్ కండీషన్ లో భాగంగా ఎన్సీబీ ఎదుట హాజరైన ఆర్యన్‌ ఖాన్‌

Aryan Khan Appears before NCB to Mark Attendance as part of Bail Conditions

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఎదుట హాజరయ్యారు. ముందుగా ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్‌ ఖాన్‌ కు బాంబే హైకోర్టు 14 షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు నెల రోజుల తర్వాత అక్టోబర్ 30న ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి ఆర్యన్‌ ఖాన్‌ విడుదలయ్యారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఎన్‌సీబీ కార్యాలయంలో హాజరుకావాలని బాంబే హైకోర్టు విధించిన బెయిల్ షరతుకు అనుగుణంగా శుక్రవారం ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ ఎదుట హాజరయ్యారు. మరోవైపు 14 బెయిల్ షరతుల్లో దేనినైనా ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని ఎన్సీబీ మళ్ళీ కోర్టును అభ్యర్థించే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − fourteen =