బయోలాజికల్-ఇ లిమిటెడ్ కీలక నిర్ణయం, కోర్బెవాక్స్‌ కోవిడ్ వ్యాక్సిన్ ధర రూ.250 కి తగ్గింపు

Biological E Limited has Reduced Corbevax COVID-19 Vaccine Price to Rs 250 Per Dose, Reduced Corbevax COVID-19 Vaccine Price to Rs 250 Per Dose, Biological E Limited has Reduced Corbevax COVID-19 Vaccine Price, Corbevax COVID-19 Vaccine Price, Corbevax COVID-19 Vaccine Price to Rs 250 Per Dose, Corbevax COVID-19 Vaccine, Biological E Limited, Covid Vaccination in India, Wuhan Virus Vaccination, Wuhan Virus, Corona Vaccination Drive, Corona Vaccination Programme, Corona Vaccine, Coronavirus, coronavirus vaccine, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination, Covid-19 Vaccination Distribution, COVID-19 Vaccination Dose, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Mango News, Mango News Telugu,

దేశంలో ప్రస్తుతం 12-14 సంవత్సరాల వయసు వారికీ హైదరాబాద్ కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇ లిమిటెడ్ రూపొందించిన “కోర్బెవాక్స్‌” కోవిడ్ వ్యాక్సిన్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే 5-12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కూడా కోర్బెవాక్స్ వ్యాక్సిన్ ను అందించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్బెవాక్స్‌ వ్యాక్సిన్ ధర విషయంలో బయోలాజికల్-ఇ లిమిటెడ్ సంస్థ తాజాగా కీలక ప్రకటన చేసింది. కోర్బెవాక్స్‌ కోవిడ్ వ్యాక్సిన్‌ను మరింత సరసమైన ధరకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు కోర్బెవాక్స్‌ వ్యాక్సిన్ ధర ఒక్కో డోసుకు రూ.840 ఉండగా, దీన్ని జీఎస్టీతో కలిపి రూ.250 కు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు.

ఇకపై ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలు/ఆసుపత్రులకు ఒక్కో డోసు ధర జీఎస్టీతో కలిపి రూ.250 కు లభించనుండగా, టాక్సులు మరియు అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలతో కలిపి వ్యాక్సిన్ తీసుకునే వారికీ ఒక్కో డోస్ ధర రూ.400 గా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు  12-14 సంవత్సరాల వయసు వారికీ మార్చి 16న కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఇప్పటివరకు 3,09,04,928 మంది మొదటి డోస్, 1,06,53,576 మందికి రెండో డోస్ కోర్బెవాక్స్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక వ్యాక్సిన్ వృధాను నివారించడంలో భాగంగా కోర్బెవాక్స్‌ వ్యాక్సిన్ యొక్క ఒక డోస్ ఒకే సీసాలో అందిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 9 =