ఉత్తరాఖండ్‌ నూతన సీఎంగా తీరత్‌ సింగ్‌ రావత్‌, 4 గంటలకు ప్రమాణస్వీకారం

BJP MP Tirath Singh Rawat, BJP MP Tirath Singh Rawat to Become New Chief Minister of Uttarakhand State, Mango News, New Chief Minister of Uttarakhand, Pauri Garhwal MP Tirath Singh Rawat, Tirath Singh Rawat To Be New Uttarakhand Chief Minister, Tirath Singh Rawat to Become New Chief Minister of Uttarakhand, Tirath Singh Rawat to become the next chief minister, Uttarakhand, Uttarakhand CM, Uttarakhand government formation, Uttarakhand new CM

ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎంపీ తీరత్‌ సింగ్‌ రావత్‌ ను ఎంపిక చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బుధవారం ఉదయం డెహ్రాడూన్‌లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో తీరత్‌ సింగ్‌ రావత్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా సొంత బీజేపీ పార్టీ నేతల నుంచే వ్యతిరేకత రావడంతో బీజేపీ అధిష్టానం సూచన మేరకు సీఎం పదవికి మంగళవారం నాడు త్రివేంద్ర సింగ్‌ రావత్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సీఎం రేసులో రాష్ట్ర ఎమ్మెల్యే ధన్‌సింగ్‌ రావత్‌ తో పాటుగా కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ పేర్లు వినిపించినప్పటికీ, కోటరీలతో సంబంధం లేకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న ఎంపీ తీరత్‌ సింగ్‌ రావత్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. తీరత్‌ సింగ్‌ రావత్ 2019 ఎన్నికల్లో పౌరి గర్వాల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. మరోవైపు ఉత్తరాఖండ్ రాష్ట్ర 9 వ సీఎంగా తీరత్‌ సింగ్‌ రావత్‌ బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 9 =