CWG 2022: వెయిట్‌ లిఫ్టింగ్ లో భారత్ కు తొమ్మిదో పతకం, కాంస్యం గెలుచుకున్న లవ్‌ప్రీత్ సింగ్

Commonwealth Games-2022 Weightlifter Lovepreet Singh Wins Bronze Medal, Weightlifter Lovepreet Singh Wins Bronze Medal In Commonwealth Games-2022, Weightlifter Lovepreet Singh Wins Bronze Medal, Bronze Medal In Commonwealth Games-2022, Weightlifter Lovepreet Singh, CWG 2022, Commonwealth Games-2022, Birmingham Commonwealth Games 2022, 2022 Birmingham Commonwealth Games, Birmingham Commonwealth Games, Commonwealth Games, Birmingham Alexander Stadium, Commonwealth Games 2022 sports, Birmingham Commonwealth Games 2022 News, Birmingham Commonwealth Games 2022 Latest News, Birmingham Commonwealth Games 2022 Latest Updates, Birmingham Commonwealth Games 2022 Live Updates, Mango News, Mango News Telugu,

కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022 లో భారత్ వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతుంది. వెయిట్‌ లిఫ్టింగ్ లో భారత్ పతకాల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇప్పటికి భారత్ ఖాతాలో 14 పతకాలు చేరగా అందులో 9 పతకాలు వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలోనే సాధించడం విశేషం. గేమ్స్ లో ఆరో రోజైన ఆగస్టు 3, బుధవారం నాడు భారత్ వెయిట్ లిఫ్టర్‌ లవ్‌ప్రీత్ సింగ్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. పురుషుల 109 కేజీల విభాగంలో లవ్‌ప్రీత్ సింగ్ 355 కేజీలు (స్నాచ్‌లో 163 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 192 కేజీలు) ఎత్తి మూడో స్థానంలో నిలవడంతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

లవ్‌ప్రీత్ సింగ్ స్నాచ్ లో మూడు ప్రయత్నాల్లో వరుసగా 157, 161, 163 కేజీలు లిఫ్ట్ చేశాడు. అనంతరం క్లీన్‌ అండ్‌ జర్క్‌ లో తొలి ప్రయత్నంలో 185 కేజీలు, రెండో ప్రయత్నంలో 189 కేజీలు, మూడో ప్రయత్నం 192 కేజీలు లిఫ్ట్ చేశాడు. ఇక 109 కేజీల విభాగంలో కామెరూన్‌కు చెందిన జూనియర్ పెరిక్లెక్స్ 361 కేజీలు ఎత్తి స్వర్ణం పతకం, సమోవాకు చెందిన జాక్ ఒపెలోజ్ 358 కేజీలు ఎత్తి రజత పతకాన్ని దక్కించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =