ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 30,752 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 141 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమగోదావరిలో 27, చిత్తూరులో 26, గుంటూరులో 24, కృష్ణాలో 16, శ్రీకాకుళంలో 13, అనంతపూర్ లో 10 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,687 కు చేరుకుంది.
ఇక కరోనా వలన కొత్తగా పశ్చిమగోదావరి మరియు విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14492 కు చేరింది. గత 24 గంటల్లో 165 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,61,122 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,073 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ