కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 52,862 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 5,404 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 10.22 శాతంగా నమోదైంది. దీంతో నవంబర్ 8, సోమవారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 50,20,909 కి చేరింది.
అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 80 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 33,978 కు పెరిగింది. ఇక కొత్తగా 6,136 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 49,14,993 కు చేరింది. దేశంలో ప్రస్తుతం కేరళలోనే అత్యధికంగా 71,316 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళలో ఇప్పటివరకు 3,83,91,348 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ