దేశంలో విజయవంతంగా కరోనా వ్యాక్సినేషన్: 36.89 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

Covid-19 Vaccination in India: More than 36.89 Crore Vaccine Doses Administered Till Now

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 36.89 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 9, శుక్రవారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 36.89 కోట్లు (36,89,91,222) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అలాగే వ్యాక్సినేషన్ ప్రారంభమైన 174వ రోజైన (జూలై 8, గురువారం) నాడు 40,23,173 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగిందని, ఇందులో 27,01,200 లబ్ధిదారులు మొదటి డోస్, 13,21,973 మంది లబ్ధిదారులు రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వివరాలు (జూలై 9, ఉదయం 7 గంటల వరకు):

  • హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,02,41,588
  • హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 73,71,624
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,76,40,956
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 98,12,170
  • 18-44 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 10,84,53,590
  • 18-44 ఏళ్ల వయసు వారు (రెండో డోసు): 33,79,213
  • 45 ఏళ్ల వయసు పైబడిన వారు (మొదటి డోసు): 9,25,87,549
  • 45 ఏళ్ల వయసు పైబడిన వారు (రెండో డోసు): 2,21,77,450
  • 60 ఏళ్ల వయసు పైబడినవారు (మొదటి డోసు): 6,97,55,230
  • 60 ఏళ్ల వయసు పైబడినవారు (రెండో డోసు): 2,75,71,852
  • ఇప్పటివరకు పంపిణీ చేసిన మొదటి డోసు వ్యాక్సిన్ డోసులు : 29,86,78,913
  • ఇప్పటివరకు పంపిణీ చేసిన రెండవ డోసు వ్యాక్సిన్ డోసులు : 7,03,12,309
  • మొత్తం పంపిణీ చేసిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 36,89,91,222

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + six =