దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 89.89 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత

Covid-19 Vaccination : More than 5.67 Cr Vaccine Doses still Available with States, UTs to be Administered

దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఉచిత కేటగిరీ సహా అన్ని విధానాల ద్వారా ఇప్పటికి మొత్తం 89.89 కోట్లకుపైగా (89,89,83,265) కోవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు. ఇక అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 5.67 కోట్లకుపైగా (5,67,37,905) నిల్వలు, వినియోగించని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

మరోవైపు దేశంలో హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతుండగా, అక్టోబర్ 4, సోమవారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 90.79 కోట్లు (90,79,32,861) దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 23,46,176 మందికి వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + thirteen =