12-18 ఏళ్ల పిల్లలకు మరో వ్యాక్సిన్, కోర్బెవాక్స్‌ కోవిడ్-19 వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపిన డీసీజీఐ

DCGI Gives Approval to Corbevax Covid-19 Vaccine for Use in 12-18 Age Group, DCGI Gives Approval to Corbevax Covid-19 Vaccine, DCGI, Corbevax Covid-19 Vaccine for Use in 12-18 Age Group, Corbevax, Corbevax Covid-19 Vaccine, Corbevax Covid-19 Vaccine Gots Approval From DCGI, covid-19 Vaccination In India, Covid 19 vaccines, covid-19 Vaccination, covid-19 Vaccination Live News, covid-19 Vaccination Live Updates, Covid 19 vaccine, Latest Vaccine Information, Coronavirus, coronavirus india, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Covid Vaccination, Covid Vaccination Updates, Covid Vaccination Live Updates, Mango News Telugu,

దేశంలో త్వరలో పిల్లలకు మరో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇ లిమిటెడ్ రూపొందించిన కోర్బెవాక్స్‌ కోవిడ్ వ్యాక్సిన్ కు డ్రగ్స్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) బుధవారం నాడు పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేసింది. 12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు.

దేశంలో 12-18 ఏళ్ల పిల్లలకు అందించేందుకు అనుమతి పొందిన మూడో వ్యాక్సిన్ గా కోర్బెవాక్స్‌ నిలిచింది. ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్‌ ను జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి అందిస్తున్నారు. అలాగే జైడస్‌ క్యాడిలా సంస్థ పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిన “జైకోవ్‌-డి” అనే కోవిడ్-19 వ్యాక్సిన్ ను 12 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు మరియు పెద్దలకు ఇచ్చేందుకు డీసీజీఐ ఆమోదం తెలిపింది. అయితే కేంద్రప్రభుత్వం ఇంకా 15 ఏళ్ల లోపు పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్‌ ఇచ్చే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కోర్బెవాక్స్‌ ఫేజ్ 2, 3 క్లినికల్ అధ్యయనం యొక్క మధ్యంతర ఫలితాల ఆధారంగా 12 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారికీ పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి ఆమోదం పొందినట్లు బయోలాజికల్-ఇ సంస్థ వెల్లడించింది. మరోవైపు డిసెంబరు 28, 2021న పెద్దల కోసం కూడా అత్యవసర వినియోగానికి కోర్బెవాక్స్‌ కోవిడ్ వ్యాక్సిన్ కు డీసీజీఐ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =