అమెజాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది తొలగింపు, ఇండియాలో సుమారు 1,000 ఉద్యోగాల కోత

E-commerce Giant Amazon To Layoff 18000 Employees Across The World Likely 1000 Job Cuts in India, Likely 1000 Job Cuts in India,E-commerce Giant Amazon To Layoff 18000 Employees Across The World, Layoff 18000 Employees Across The World, 18000 Employees, Amazon To Layoff 18000 Employees Across Globe, Amazon to lay off around 1000 staff in India, Amazon India to lay off 1% workforce, E-commerce Giant Amazon, Amazon Plans To Fire 1000 Employees In India, Amazon News, Amazon Latest News And Updates, Amazon Live Updates, Mango News, Mango News Telugu

ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ‘అమెజాన్‘ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించనుంది. దీనిలో భాగంగా ఇండియాలో సుమారు 1,000 మందికి ఉద్వాసన పలకనుంది. ఈ మేరకు అమెజాన్‌ సీఈవో ఆండీ జెస్సీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ అనంతర అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇక డిసెంబర్ 31, 2021 నాటికి, అమెజాన్ దాదాపు 16,08,000 మంది ఫుల్ టైమ్ మరియు పార్ట్ టైమ్ సిబ్బందిని నియమించుకుందని తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 10 శాతం మందిని తొలగించాలని నిర్ణయించుకున్నామని ఆయన వెల్లడించారు. కాగా ప్రస్తుతం అమెజాన్‌ ఇండియాలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 18,000 ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం, భారతదేశంలోని 1,000 మంది ఉద్యోగాల కోతకు దారి తీసే అవకాశం ఉంది. అయితే దీనిపై అమెజాన్ ఇండియా ప్రతినిధి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − one =