ఆసియా కప్ 2022: నేడు పాక్‌తో తలపడనున్న భారత్.. అరుదైన రికార్డు ముంగిట విరాట్ కోహ్లీ

Ind vs Pak Asia Cup 2022 Virat Kohli Set To Become The First Indian Player To Play 100 Matches in All Formats, India vs Pakistan Asia Cup 2022, Virat Kohli Completes 100 T20I Matches, Virat Kohli 100 Matches Record In All Formats, Mango News, Mango News Telugu, IND VS PAK T20 Match, Virat Kohli Latest News And Updates, Virat Kohil 100 Matches in All Formats, Asia Cup 2022 News And Live Updates, India Vs Pakistan Live Match, Virat Kohi 100 Matches Record, Virat Kohli

దుబాయ్‌లో జరుతున్న ప్రతిష్టాత్మక ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆదివారం కీలక మ్యాచ్ జరుగనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్ – పాకిస్తాన్‌ జట్లు నేడు తమ తొలి మ్యాచ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా బాబర్ ఆజం నేతృత్వంలోని దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. కాగా సాధారణంగా వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీని ఇప్పటికి 14సార్లు నిర్వహించగా.. టీ20 ఫార్మాట్‌లో జరుగనుండడం మాత్రం ఇది రెండోసారి. ఇక భారత జట్టు ఏడుసార్లు విజేతగా నిలవగా, ప్రస్తుతం హ్యాట్రిక్‌ టైటిల్ వశం చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. డబుల్‌ రౌండ్‌రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరుగనున్న ఈ టోర్నీలో భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌తో పాటు హాంకాంగ్‌ జట్లు పాల్గొంటున్నాయి. నేటి రాత్రి 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఇక ఈ తరుణంలో భారత స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ ఇప్పుడో అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. నేటి మ్యాచ్‌ కోహ్లికి 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ కావడం విశేషం. దీంతో అన్ని ఫార్మాట్లలో (టెస్టులు, వన్డేలు, టీ20లలో) 100 మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయ ఆటగాడిగా నిలవనున్నాడు. అయితే ప్రస్తుతం కోహ్లీ తన కెరీర్‌లోనే అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. సుదీర్ఘ కాలంగా ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న కోహ్లీ సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు కావొస్తోంది. అలాగే జూలైలో ఇంగ్లండ్ పర్యటన ముగిసిన 42 రోజుల విరామం తర్వాత కోహ్లీ నేడు మళ్ళీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. నేటి భారత్‌ – పాకిస్తాన్‌ మ్యాచ్‌తో తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్న కోహ్లీపైనే అందరి కళ్ళు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఈరోజు మ్యాచ్‌లో ఎలా ఆడతాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో విరాట్ కోహ్లీపై అంచనాలు మరింతగా పెరిగాయి.

జట్లు అంచనా..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేగా, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్.

పాకిస్తాన్: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =