నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో వన్డే.. సిరీస్‌పై టీమిండియా కన్ను

Ind vs WI ODI Series Team India To Play 2nd Match with West Indies Today Eye on The Series, Ind vs WI ODI Series Team India To Play 2nd Match with West Indies Today, Team India Eye on The Series, Team India To Play 2nd Match with West Indies Today, Ind vs WI ODI Series, Ind Vs WI 2nd ODI Match, Ind Vs WI, Ind Vs WI 2nd ODI, Ind Vs WI 2nd ODI News, Ind Vs WI 2nd ODI Latest News, Ind Vs WI 2nd ODI Latest Updates, Ind Vs WI 2nd ODI Live Updates, Mango News, Mango News Telugu,

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా నేడు రెండో వన్డే ఆడనుంది. ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో శిఖర్ ధవన్ నేతృత్వంలోని టీమిండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఉత్కంఠగా సాగిన తొలి మ్యాచ్‌లో విండీస్‌ను 3 పరుగుల తేడాతో ఓడించిన భారత్, నేటి మ్యాచ్ లోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే టీమిండియా తుది జట్టులో ఒక మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి వన్డేలో ప్రభావం చూపించలేకపోయిన ప్రసిధ్ కృష్ణ స్థానంలో మరో పేసర్‌ ఆవేశ్‌ ఖాన్‌కు ఛాన్స్‌ ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఇది మినహా జట్టులో మార్పులు ఉండకపోవచ్చు.

ఓపెనర్లుగా ధవన్‌, గిల్‌.. వన్‌డౌన్‌లో శ్రేయస్‌ అయ్యర్‌, మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌, దీపక్‌ హుడా, సంజూ శాంసన్‌.. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో అక్షర్‌ పటేల్‌, శార్ధూల్‌ ఠాకూర్‌, ఏకైక స్పిన్నర్‌గా చహల్‌, పేసర్లుగా ఆవేశ్‌ ఖాన్‌, సిరాజ్‌లను తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది. అయితే మరోవైపు తొలి వన్డేలో భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరివరకు ప్రయత్నించి విఫలమైన విండీస్‌, ఈ మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. దీంతో నేటి మ్యాచ్ ఇరు జట్లకూ కీలకం కానుంది. కాగా చివరిసారి భారత్ వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్‌లో పర్యటించినప్పుడు, మెన్ ఇన్ బ్లూ 2-0తో విజేతగా నిలిచింది, ఒక మ్యాచ్ వర్షం కారణంగా వాష్ అవుట్ అయింది.

తుది జట్ల అంచనా..

భారత్: శిఖర్ ధవన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్.

వెస్టిండీస్‌: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్, షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, రోవ్‌మన్ పావెల్ మరియు జేడెన్ సీల్స్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here