లార్డ్స్‌ టెస్టులో భారత్ జట్టు సంచలన విజయం, సిరీస్‌లో 1-0 ఆధిక్యం

India beat England by 151 runs in second Test, India beat England by 151 runs to win second Test, India Defeat England by 151 Runs, India Defeat England by 151 Runs Takes Lead with 1-0 in Series, India Defeat England In 2nd Test To Take 1-0 Series Lead, India vs England, India vs England 2nd Test, India vs England Highlights, India vs England Highlights 2nd Test, India vs England Match, India vs England Match News, India Win Thriller At Lord’s To Take 1-0 Series Lead vs England, Mango News

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్ లోని లార్డ్స్‌ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో భారత్ జట్టు 151 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్‌ లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తోలి ఇన్నింగ్స్ లో కేఎల్‌ రాహుల్‌ సెంచరీ, రోహిత్‌ శర్మ కీలక ప్రదర్శన, రెండో ఇన్నింగ్స్ లో మహమ్మద్ షమి, బుమ్రా బ్యాటింగ్ పోరాటం, భారత్ బౌలర్ల మెరుపులు…ఇలా ఆల్ రౌండ్  పెరఫార్మన్స్ తో లార్డ్స్‌ టెస్టులో భారత్ జట్టు చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. చివరిరోజు మెరుగైన ప్రదర్శనతో అద్భుత విజయం దక్కడంతో భారత్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.

ముందుగా 181/6 వద్ద ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్ జట్టు 298/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌ లో భారత్ బౌలర్లు మహమ్మద్ షమి (56 నాటౌట్‌: 70 బంతుల్లో 6×4, 1×6), బుమ్రా (34 నాటౌట్‌: 64 బంతుల్లో 3×4) బ్యాటింగ్ పోరాటం ఈ మ్యాచ్ ను పూర్తిగా భారత్ వైపు తిప్పింది. షమి, బుమ్రా అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ ముందు భారత్ 272 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 120 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌ లో సిరాజ్‌ 4, బుమ్రా 3, ఇషాంత్‌ 2 వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ పూర్తిగా చేతులెత్తశారు. కెప్టెన్ జో రూట్ (33), జాస్ బట్లర్ (25) మాత్రమే పరుగులు సాధించగలిగారు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల తీసి సిరాజ్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ఆగస్టు 25 నుంచి హీడింగ్లి స్టేడియంలో జరగనుంది.

భారత్–ఇంగ్లాండ్ రెండో టెస్టు వివరాలు:

భారత్ తోలి ఇన్నింగ్స్: 364-10

  • కేఎల్ రాహుల్ (129), రోహిత్ శర్మ (83)
  • జేమ్స్ ఆండర్సన్ 5/62, రాబిన్సన్ 2/73, మార్క్ వుడ్ 2/91

ఇంగ్లాండ్ తోలి ఇన్నింగ్స్: 391-10

  • జో రూట్ (180), బెయిర్ స్టో (57)‌
  • సిరాజ్ 4/94, ఇషాంత్ 3/69

భారత్ రెండో ఇన్నింగ్స్: 298-8/డిక్లేర్‌

  • అజింక్య రహానే (61), షమి (56*)
  • మార్క్ వుడ్ 3/51, రాబిన్సన్ 2/45

ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్: 120-10

  • జో రూట్ (33), జాస్ బట్లర్ (25)
  • సిరాజ్ 4/32, బుమ్రా 3/33

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 20 =