వరల్డ్‌ నెంబర్‌వన్‌ చెస్ చాంపియన్‌ కార్ల్‌సన్‌కు ఇండియన్ టీనేజర్ ప్రజ్ఞానంద చెక్‌

Indian Teen Praggnanandhaa Defeats World No.1 Magnus Carlsen In 39 Moves, Indian Teen Praggnanandhaa Defeats World No.1 Magnus Carlsen, Indian Teen Praggnanandhaa, World No.1 Magnus Carlsen, Indian Teen Praggnanandhaa stuns World No. 1 Magnus Carlsen, Praggnanandhaa, indian teen, magnus carlsen, Praggnanandhaa Defeats World No.1 Magnus Carlsen In 39 Moves, 39 Moves, 16 Year Old Grandmaster, 39 Moves, Mango News, Mango News Telugu,

వరల్డ్‌ నెంబర్‌వన్‌ చెస్ చాంపియన్‌ కార్ల్‌సన్‌కు ఇండియన్ టీనేజర్, 16 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద చెక్‌ పెట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో సోమవారం జరిగిన ఎనిమిదో రౌండ్‌లో అద్భుతమైన ఆటను ప్రదర్శించిన చెన్నైకి చెందిన 16 ఏళ్ల ప్రజ్ఞానంద ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌పై సంచలన విజయం నమోదు చేశాడు. సోమవారం జరిగిన ఈ గేమ్ లో నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద తరాష్‌ డిఫెన్స్‌తో నంబర్‌ వన్‌ కార్ల్‌సన్‌ (నార్వే) ఆట కట్టించాడు. కేవలం 39 ఎత్తుల్లోనే గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.

ఈ విజయంతో ప్రజ్ఞానంద భారతీయ చెస్ మేథావుల నుండి ప్రశంసలు అందుకున్నాడు. ప్రజ్ఞానంద ఇప్పటివరకు ఎనిమిది రౌండ్లలో ఎనిమిది పాయింట్లు సంపాదించి టోర్నమెంట్ పట్టికలో 12వ స్థానంలో ఉన్నాడు. ఆన్‌లైన్ గేమ్ 15+10 విజయం తరువాత, ప్రజ్ఞానంద ఒక టోర్నమెంట్‌లో మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించిన మూడవ భారతీయుడు కావడం విశేషం. ఈ విజయం ద్వారా లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ మరియు పి హరికృష్ణలతో కూడిన భారతీయ చెస్ ఆటగాళ్ల ఎలైట్ జాబితాలో చేరాడు. ప్రాథమిక దశలో ఇంకా 7 రౌండ్లు మిగిలి ఉన్నందున ప్రజ్ఞానందకు టోర్నమెంట్‌లో మెరుగైన అవకాశాలు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − two =