ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ కీలక నిర్ణయం.. జట్టు ప్రధాన కోచ్‌గా వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా నియామ‌కం

IPL Franchise Sunrisers Hyderabad Appoints West Indies Legend Brian Lara as New Head Coach, Sunrisers Hyderabad Appoints West Indies Legend Brian Lara as New Head Coach, Sunrisers Hyderabad Announces New Head Coach, SRH Announces New Head Coach, Sunrisers Hyderabad, IPL Team SRH, West Indies batting legend Brian Lara, Brian Lara appointed new head coach of Sunrisers Hyderabad, new head coach of Sunrisers Hyderabad, West Indies legend Brian Lara, Sunrisers Hyderabad Head Coach, SRH New Head Coach News, SRH New Head Coach Latest News And Updates, SRH New Head Coach Live Updates, Mango News, Mango News Telugu,

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఫ్రాంచైజీ ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు ప్రధాన కోచ్‌గా వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారాను నియమించింది. ఈ మేరకు సన్‌రైజర్స్ యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్‌లో తెలిపింది. కాగా 2023 సీజన్ నుండి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త ప్రధాన కోచ్‌గా సేవలందిస్తారని పేర్కొంది. అలాగే ఇప్పటివరకు కోచ్‌గా ఉన్న టామ్ మూడీ, జట్టుకు అతను అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపింది.

కాగా 2022 సీజ‌న్‌లో లారా హైద‌రాబాద్ జ‌ట్టుకు స్ట్రాట‌జిక్ అడ్వైజ‌ర్‌గా మరియు బ్యాటింగ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. అయితే టామ్ మూడీ కోచ్‌గా వ్యవహరించిన 2013 నుంచి 2019 వ‌ర‌కు హైదరాబాద్ మంచి ఫలితాలే రాబట్టింది. అయిదుసార్లు ప్లే ఆఫ్స్‌కు కూడా చేరుకుంది. ఈ క్రమంలో 2016లో టైటిల్ గెలుచుకుంది. మూడీ 2020, 2021లలో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరించాడు. అలాగే గత సంవత్సరం వీవీఎస్ లక్ష్మణ్ స్థానంలో తిరిగి కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఈ సీజ‌న్‌లో సన్‌రైజర్స్ పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. దీంతో కొత్త కోచ్ నియామకానికి యాజమాన్యం మొగ్గు చూపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 8 =