సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్‌ ఎన్వీ రమణ, రాష్ట్రపతి ఉత్తర్వులు

Chief Justice Of India, Justice NV Ramana, Justice NV Ramana Appointed Next Chief Justice Of India, Justice NV Ramana Appointed Next Chief Justice Of India By President Ramnath Kovind, Justice NV Ramana next CJI, Justice NV Ramana to take over as next Chief Justice, Justice NV Ramana to take over as next Chief Justice of India, Mango News, NV Ramana Appointed Next Chief Justice Of India, President, President Appoints Justice NV Ramana As The Next Chief .Justice, President Ramnath Kovind, Ramnath Kovind

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్‌ ఎన్వీ రమణ నియమితులు అయ్యారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్‌ ఎన్వీ రమణ పేరును ఇటీవలే ప్రస్తుత సీజే జస్టిస్ శరద్‌ అర్వింద్‌ బాబ్డే ‌కేంద్రానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ప్రతిపాదనను కేంద్రం పరిశీలించిన అనంతరం రాష్ట్రపతి కార్యాలయానికి చేరింది. తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ ప్రతిపాదనలను ఆమోదించి, సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ శరద్‌ అర్వింద్‌ బాబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 24 వ తేదీన జస్టిస్‌ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే ఆగస్టు 26, 2022 వరకు జస్టిస్‌ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు.

సుప్రీంకోర్టులో ప్రస్తుత సీజే జస్టిస్ శరద్‌ అర్వింద్‌ బాబ్డే తరవాత జస్టిస్ ఎన్వీ రమణ అత్యంత సీనియర్ న్యాయమూర్తి. జస్టిస్‌ ఎన్వీ రమణ 1957 ఆగస్ట్ 27న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో జన్మించారు. 1983లో ఆయన న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలు పెట్టారు. జూన్ 2000 లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అలాగే ఫిబ్రవరి 2014లో పదోన్నతి భాగంగా సుప్రీంకోర్టుకు వెళ్లేముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + sixteen =